"తెలంగాణ సమాజాన్నీ ఏకం చేయాలనే మహోన్నత ఆశయం , బలమైన సంకల్పంతో మనమంతా ఏకతాటి పై నడవాలనే ఎన్నారైల ఆకాంక్షల నుంచి మొదలై అందరూ ఏకమై కలసిమెలిసేలా విశ్వవేదిక కు అంకురార్పణ జరుగుతుంది".
తెలంగాణ గడ్డపై పుట్టి మహోన్నత ప్రతిభ పాటవాలతో తమ ప్రజ్న ని చాటుతున్న తెలంగాణ సోదరి సోదరులని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఉన్నత ఆలోచనలకు ప్రతిరూపంగా పురుడుపోసుకుంటుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.